🌸 Welcome to MPUPS BORGI AURAD 🌸 Admissions Open for Classes 1st to 7th | Quality Education | Experienced Teachers | Enroll Today! 📚🎓
🌟 నేటి ప్రేరణాత్మక సూక్తి 🌟
  • Optional Holiday on 25 June 2026
  • Free Textbooks Distributed
  • Muharram Holiday on 26 June 2026
  • Bring School ID Card Daily
  • Maintain Clean Uniform
  • Complete Homework Regularly
  • Independence Day - 15 August
  • Gandhi Jayanti - 2 October
  • Christmas - 25 December
1 1 2 3 4 5 6 7 8 9 10

బోర్గి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం

బోర్గి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం

సంగారెడ్జిడి జిల్లా, కంగ్టి మండలం, బోర్గి ప్రాథమికోన్నత పాఠశాలలో 13- జూన్ -2025(గురువారం)నాడు సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా చిన్నారులకు విద్యాబుద్ధులు ప్రారంభించే సంప్రదాయబద్ధమైన ఈ వేడుకను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు ఉత్సాహంగా నిర్వహించారు.

బోర్గి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం - Samuhika Aksharaabhyasam MPUPS BORGI AURAD

ఈ కార్యక్రమంలో ఒకటవ తరగతిలో ప్రవేశం పొందిన చిన్నారులు అక్షరాభ్యాసంలో పాల్గొన్నారు. ఉదయం నుంచే పాఠశాల ఆవరణ పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. సంప్రదాయబద్ధంగా పలకలపై "ఓం నమః శివాయ" అని రాయించి, అక్షర స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పలువురు గ్రామ పెద్దలు, విద్యావేత్తలు మాట్లాడుతూ విద్య ప్రాముఖ్యతను, పిల్లల భవిష్యత్తుకు పునాది అని నొక్కి చెప్పారు. అక్షరాభ్యాసం ద్వారా చిన్నారులలో విద్యాసక్తిని పెంపొందించడం, భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పాఠశాల ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు.

తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తకాలు, పెన్నులు అందజేసి, వారికి మంచి విద్యను అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిన్నారుల ముఖాల్లో కనిపించిన ఉత్సాహం, వారి భవిష్యత్తుపై అక్షరాల ప్రభావం ఈ కార్యక్రమానికి మరింత శోభను చేకూర్చింది.

ముఖ్య అంశాలు:

  • తేదీ: జూన్ 13, 2025 (గురువారం)
  • స్థలం: ప్రాథమికోన్నత పాఠశాల, బోర్గి, కంగ్టి మండలం, సంగారెడ్డి జిల్లా 
  • కార్యక్రమం: సామూహిక అక్షరాభ్యాసం.
  • ముఖ్య ఉద్దేశ్యం: విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా చిన్నారులకు విద్యాబుద్ధులు ప్రారంభించడం, వారిలో విద్యాసక్తిని పెంపొందించడం.

Mass Aksharabhyasam Celebrated Grandly at Borgi Upper Primary School


Sangareddy District, Kangti Mandal, Borgi:
The traditional "Aksharabhyasam" (initiation into learning) ceremony was celebrated grandly at Borgi Upper Primary School on June 13, 2025 (Thursday). Marking the beginning of the academic year, this culturally significant event was organized enthusiastically by the school management, teachers, village elders, and parents to introduce children to the world of education.

The event was held for children newly admitted to Class 1, who actively took part in the Aksharabhyasam ritual. From the early morning hours, the school premises reflected a festive atmosphere. As per tradition, the children were made to write “Om Namah Shivaya” on slates as a part of their initiation into learning.

On this occasion, several village elders and educationists emphasized the importance of education, calling it the foundation for a child’s future. The school headmaster stated that the primary goal of this program is to kindle interest in education among young children and inspire them to pursue higher goals in life.

Parents gifted books and pens to their children, expressing their commitment to providing quality education for them. School committee members, teachers, parents, and villagers participated in large numbers. The joy and excitement on the children's faces, and the symbolic power of letters shaping their future, added beauty and meaning to the event.




Post a Comment

Previous Post Next Post

SUBSCRIBE US ON YOUTUBE