🌸 Welcome to MPUPS BORGI AURAD 🌸 Admissions Open for Classes 1st to 7th | Quality Education | Experienced Teachers | Enroll Today! 📚🎓
🌟 నేటి ప్రేరణాత్మక సూక్తి 🌟
  • Optional Holiday on 25 June 2026
  • Free Textbooks Distributed
  • Muharram Holiday on 26 June 2026
  • Bring School ID Card Daily
  • Maintain Clean Uniform
  • Complete Homework Regularly
  • Independence Day - 15 August
  • Gandhi Jayanti - 2 October
  • Christmas - 25 December
1 1 2 3 4 5 6 7 8 9 10

బోర్గి ప్రాథమికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు

బోర్గి ప్రాథమికోన్నత పాఠశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం

International Day of Yoga Celebrations at MPUPS BORGI AURAD, Kangti 

బోర్గి, సంగారెడ్డి జిల్లా, జూన్ 21: ప్రతి ఏడాది జూన్ 21న జరుపుకునే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బోర్గి గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం రోజున యోగా కార్యక్రమం ఎంతో ఉత్సాహంగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. “యోగా అనేది శరీరం, మనస్సు మరియు ఆత్మ మధ్య సమతౌల్యాన్ని సాధించేందుకు ఒక మార్గం. దీనివల్ల ఆరోగ్యవంతమైన జీవనశైలి ఏర్పడుతుంది” అని పేర్కొన్నారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ. కిరణ్ కుమార్ గారు మాట్లాడుతూ, విద్యార్థులు చిన్ననాటి నుంచే యోగా అభ్యాసం చేయడం వల్ల ఒత్తిడిని అధిగమించడమే కాకుండా, ఒక దృఢమైన వ్యక్తిత్వం ఏర్పడుతుందని తెలిపారు.

ఈ సందర్భంగా విద్యార్థులు సూర్య నమస్కారాలు, ప్రాణాయామం, తాడాసన, వృక్షాసన, భూజంగాసన వంటి యోగాసనాలు ప్రదర్శించారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ. కిరణ్ కుమార్ గారు వివిధ ఆసనాల ప్రాముఖ్యతను వివరించారు.

ఈ యోగా దినోత్సవం విద్యార్థులలో ఆరోగ్యంపై చైతన్యాన్ని కలిగించేలా సాగిందని ఉపాధ్యాయ బృందం ఆనందం వ్యక్తం చేసింది.

Post a Comment

Previous Post Next Post

SUBSCRIBE US ON YOUTUBE