బోర్గి ఏ పాఠశాలలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
బోర్గి ఏ గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు దేశభక్తి గీతాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ప్రసంగాలతో ఆకట్టుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశభక్తి, జాతీయ సమైక్యత, బాధ్యతాయుత పౌరులుగా ఎదగాల్సిన అవసరాన్ని వివరించారు.
ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఎంపీటీసీ, మాజీ సర్పంచులు, మాజీ ఉప సర్పంచులు, వివిధ యువజన సంఘాల నాయకులు, మహిళా సంఘాల నాయకులు, యువకులు, గ్రామ ప్రముఖులు హాజరై విద్యార్థులను అభినందించారు.
పాఠశాల ఆవరణలో దేశభక్తి నినాదాలతో సందడి నెలకొంది. అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేసి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య ముగించారు.

