అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం. అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు.
మన దేశంలో ప్రతి సంవత్సరం నవంబరు 14 న బాలల దినోత్సవం జరుపుకుంటాము. భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం రోజున ఈ ఉత్సవం జరుగుతుంది. నెహ్రూకు పిలల్లలతో వున్న బాంధవ్యాన్ని తెలుపుతూ ఈ ఉత్సవం జరుపుకుంటారు. పిల్లలు నెహ్రూను చాచా నెహ్రూ అని ప్రేమగా పిలిచేవారు.
తేది: 14 నవంబర్ 2024 నాడు ప్రాథమికోన్నత పాఠశాల బోర్గీ ఎ నందు బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈనాటి కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్ కుమార్ గారు అధ్యక్షత వహించి, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులు మొదటి భారత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ యొక్క జీవితాన్ని చదివి మీరు కూడా వారిలా ఉన్నత చదువులు చదివి, జీవితంలో అత్యంత ఉన్నత స్థానానికి ఎదిగి, పాఠశాలకు, తల్లిదండ్రులకు, గ్రామానికి మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

